శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (07:39 IST)

లక్నోలో మాంసం అమ్మకాలపై నిషేధం

కరోనా భయంతో ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం విధించారు జిల్లా కలెక్టర్ అభిషేక్ ప్రకాశ్. బహిరంగ ప్రదేశాలలో చికెన్, మటన్, చేప, సెమీ కుక్డ్ మీట్ సేల్స్ నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కరోనా వచ్చిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్లు పడి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మాంసం అమ్మకాల ద్వారా కరోనా వ్యాప్తి జరగకూడదని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో సేల్స్ పై ఆంక్షలు పెట్టామని చెప్పారు.

హోటళ్లు, రెస్టారెంట్లకు జనాలు భారీగా వస్తుంటారని, అక్కడ శుభ్రత పాటించాలని వాటి యాజమాన్యాలను ఆదేశించామని తెలిపారు కలెక్టర్. మాంసహారం ద్వారా కరోనా రాదని, అయితే బాగా ఉడికించి మాత్రమే తినాలని సూచించారు.