1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (17:33 IST)

27న జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం

ఈ నెల 27న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు.  
 
పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు చేపడుతున్న పల్స్‌ పోలియో కార్యక్రమానికి ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రయాణ ప్రాంగణాలో ప్రత్యేక కేంద్రాలు, మొబైల్‌ టీంలు ఏర్పాటు చేశారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేస్తారు.