గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (11:20 IST)

సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌ను పెళ్లాడనున్న పంజాబ్ మంత్రి

punjab minister
పంజాప్ మంత్రి హరజ్యోత్ సింగ్ బెయిన్స్ ఐపీఎస్ అధికారిణిని పెళ్లాడనున్నారు. ఆయన పెళ్లి చేసుకోనున్న ఐపీఎస్ అధికారిణి పేరు జ్యోతి యాదవ్. వీరిద్దరికీ ఇటీవల నిశ్చితార్థం జరిగింది. గతేడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రూప్నాపూర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా హరజోత్ గెలుపొందారు. 
 
ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మంత్రివర్గంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు. పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జ్యోతి యాదవ్.. ప్రస్తుతం మన్సా జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. హర్యానాలో గురుగ్రామ్‌ ఈమె స్వస్థలం. వీరిద్దరికీ పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మీ జీవితాలు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాయంటూ అభినందనలు తెలిపారు.