సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (15:07 IST)

చెన్నై క్వీన్స్‌లాండ్‌లో ఫ్రీ ఫాల్ టవర్ ఊడిపడింది...(video)

తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోని క్వీన్స్ లాండ్ అమ్యూజ్‌మెంట్ పార్కులో రాట్నం తెగి పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలైనారు. వివరాల్లోకి వెళితే.. పూందమల్లికి తర్వాత పళంజూర్ ప్రాంతానికి చెందిన ఈ పార్కులో రాట్నం తెగి పడి ప్రమాదానికి గురైంది. ఈ పార్కులో ''ఫ్రీ ఫాల్ టవర్'' అనే రైడ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
ఈ పార్కుకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఈ రైడ్‌ అంటే చాలామంది ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ రాట్నంలో ప్రజలు ఎక్కారు. రాట్నంలో ఆడుకుంటుండగా.. రాట్నంలోని ఇనుము కమ్మీలు తెగి కిందపడ్డాయి. 
 
ఈ ప్రమాదం రాట్నం కిందికి దిగుతుండగా జరగడంతో ప్రజలు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ పార్కును మూతపెట్టాల్సిందిగా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.