నలుసును తొలగించారు, రఘురామకృష్ణరాజుపై వేటు, ఆయన స్థానంలో ఎంపీ బాలశౌరి

raghuramakrishnam raju
వి| Last Modified శుక్రవారం, 16 అక్టోబరు 2020 (21:58 IST)
పార్లమెంటు కమిటీకి సంబంధించి ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్‌కు చైర్మన్‌గా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును తప్పించారు.

రఘురామకృష్ణరాజు స్థానంలో ఎంపీ బాలశౌరికి పదవి అప్పగిస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటన చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ ఇటీవల చేసిన పలు విజ్ఞప్తులు మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు ధోరణీ కనబరుస్తున్నారు.

నేరుగా సీఎం జగన్, ఎంపీ విజసాయిరెడ్డి వంటి పెద్దలను టార్గెట్ చేస్తూ పార్టీకి కంట్లో నలుసులా మారారు. దాంతో ఆయనను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించడంలో వైసీపీ సఫలమైంది.దీనిపై మరింత చదవండి :