బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జులై 2023 (08:15 IST)

పబ్జీతో సహవాసం.. చివరకు మతిస్థిమితం కోల్పోయిన బాలుడు

PuB G
రాజస్థాన్‌లో స్మార్ట్ ఫోన్ ఓ బాలుడి జీవితాన్ని చిదిమేసింది. స్మార్ట్‌ఫోనుకు బానిసైపోయిన ఓ పదేళ్ల బాలుడు చివరకు మతిస్థిమితం కోల్పోయాడు. రాజస్థాన్ అల్వార్‌కు చెందిన చిన్నారి నిత్యం ఫోనులో పబ్ జీ ఆడుతూ గడిపేవాడు. ఇటీవల గేమ్‌లో ఓడిపోయిన అతడు నిరాశను తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయాడు. 
 
ప్రస్తుతం అతడికి ప్రత్యేక పాఠశాలలో నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ప్రత్యేకమైన భౌతిక క్రీడలు ఆడిస్తూ బాలుడికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పాఠశాల టీచర్ భవానీ శర్మ వెల్లడించారు. 
 
బాలుడి తల్లి లక్ష్మి, పొరుగువాడు విద్యా ప్రయోజనాల కోసం అతనికి మొబైల్ ఫోన్ ఇచ్చాడని వెల్లడించింది. అయినప్పటికీ, బాలుడు ఫోన్‌ను అతిగా ఉపయోగించడం ప్రారంభించాడని వాపోయాడు. సమీపంలోని Wi-Fi నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయడం, నిరంతరం గేమ్‌లు ఆడటం ప్రారంభించాడు. 
 
ఈ ప్రవర్తన కుటుంబ సభ్యులకు తెలియదు. PUBG గేమ్ దాని ప్రమాదకరమైన ప్రభావానికి కారణమైందని బాలుడి తల్లి వాపోయింది. ఎప్పుడుపడితే అప్పుడు పబ్జీ ఆడేవాడని.. ఆ ప్రవర్తనే అతడి కొంపముంచిందని చెప్పుకొచ్చింది.