సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జులై 2023 (15:43 IST)

"కాంతార'': రిషబ్ శెట్టి పేరిట ఓ ఫౌండేషన్

Kanthara
రిషబ్ శెట్టి కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు. ఇటీవల విడుదలైన "కాంతార" సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. 
 
తమిళం, తెలుగు, హిందీతో సహా వివిధ భాషలలో విడుదలైన ఈ చిత్రం మంచి విమర్శనాత్మక, ఆర్థిక ఆదరణను పొందడమే కాకుండా రిషబ్ శెట్టికి భారతదేశం అంతటా గుర్తింపు తెచ్చింది.
 
ప్రస్తుతం "కాంతార" రెండో భాగానికి దర్శకత్వం వహించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంలో, రిషబ్ శెట్టి తన 40వ పుట్టినరోజును తన అభిమానులతో జరుపుకున్నాడు. 
 
ఈ కార్యక్రమంలో "కాంతార" సినిమాలోని 'భూత కోల' డ్యాన్స్‌ను వేదికపై ప్రదర్శించి అభిమానులను ఉర్రూతలూగించారు. 
 
ఆ తర్వాత రిషబ్ శెట్టి పేరిట ఓ ఫౌండేషన్ ప్రారంభించినట్లు ఆయన భార్య ప్రగతి తెలిపారు. ఈ ఫౌండేషన్ పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడుతుందని ప్రకటించారు.