గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (09:54 IST)

గౌరవం లేని మంత్రి పదవి నాకొద్దు.. : సీఎంకు రాజస్థాన్ మంత్రి లేఖ

ashok chandna
గౌరమ మర్యాదలు లేని మంత్రి పదవి తనకు వద్దని, ఈ మంత్రి పదవిని కూడా రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శికే అప్పగించాలని రాజస్థాన్ రాష్ట్ర మంత్రి అశోక్ చంద్నా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఇదే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఓ లేఖ రాశారు. 
 
రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి రాసిన లేఖ సంచలనంగా మారింది. ఆ రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, విపత్తుల నిర్వహణ శాఖామంత్రిగా అశోక్ చంద్నా నియమితులయ్యారు. అయితే, గత కొంతకాలంగా ఈయన బాధ్యతలన్నింటినీ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కుల్దీప్ రంకా జోక్యం మితిమీరిపోయినట్టు ఆయన ఆరోపిస్తున్నారు. 
 
దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ సీఎం గెహ్లాట్‌కు చంద్నా లేఖ రాశారు. తన పరిధిలోని శాఖల్లో ఆ ఉన్నతాధికారి జోక్యం మితిమీరిపోయిందని, గౌరవం లేనిచోట తాను ఉండలేనని అందువల్ల తనను మంత్రిపదవి నుంచి తప్పించి, తన శాఖలన్నింటిని ఆ అధికారికే ఇచ్చేయండి అంటూ అసహనం వ్యక్తం చేస్తూ, లేఖ రాశారు. 
 
ఇటీవల సొంత పార్టీ ఎమ్మెల్యే గణేష్ గోర్గా అధికారుల అతి, భూదందాలపై సంచలన ఆరోపణలు చేసిన కొన్నిరోజులకే ఏకంగా ఓ మంత్రి తన అసంతృప్తిని వ్యక్తంచేస్తూ సీఎంకు లేఖ రాయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.