గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (11:34 IST)

రాజస్థాన్‌లో విషాదం.. వందే భారత్ రైలు ఢీకొని.. జింకతో పాటు వ్యక్తి మృతి

vande bharat
రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నీలగై జింకను ఢీకొట్టిన ఘటనలో జింకతో పాటు ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ఘటన అల్వార్‌లోని కలి మోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద జరిగింది. వందే భారత్ రైలు లేగంగా వెళ్తూ పట్టాలపైన ఉన్న ఓ నీలగై జింకను ఢీ కొట్టింది. దీంతో అది ఎగిరి సమీపంలో వున్న ఓ వ్యక్తిపై పడింది. ఈ ఘటనలో జింకతో పాటు ఆ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడిని శివదయాల్‌గా గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రైలును కాసేపు ఆపేశారు. ప్రమాదానికి కారణమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌కు వెళ్తోంది.