ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మద్యం సేవించలేదని యువకుడిని దారుణంగా కొట్టి విద్యార్థులు.. (Video)

student beat
విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పలువురు విద్యార్థులు పెడదారిపడుతున్నారు. తాము పక్కదారి పట్టడమే కాకుండా, తమతో ఉన్న విద్యార్థులు కూడా చెడిపోయేలా వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా తమతో కలిసి మద్యం సేవించలేదన్న అక్కసుతో సాటి విద్యార్థిని కొందరు విద్యార్థులు కలిసి చితకబాదారు.
 
ఈ దారుణ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రా యూనివర్సిటీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వర్శిటీలో ఎంబీఏ విద్యార్థి రజత్ కుమార్‌ను మద్యం సేవించాలని ఇతర విద్యార్థులు ఒత్తిడి చేశారు. అతడు నిరాకరించడంతో ఆగ్రహంతో అతడిపై పిడిగుద్దులు కురిపిస్తూ బెల్టుతో దారుణంగా కొట్టారు. దాడికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.