సాగు చట్టాలకు వ్యతిరేకంగా 25న భారత్ బంద్
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా వచ్చే నెల 25వ తేదీన భారత్ బంద్ పాటించనున్నారు. ఈ మేరకు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల నిరసనలను ముందుండి నడిపిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సెప్టెంబరు 25వ తేదీన భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చింది.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు నిరసనగా గత ఏడాది నవంబర్ నుంచి జరుగుతున్న ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు బంద్‌కు పిలుపు ఇచ్చామని ఎస్‌కేఎం ప్రతినిధులు వెల్లడించారు.
ఇదే అంశంపై సింఘ్ సరిహద్దుల్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్‌కేఎం ప్రతినిధి అశీష్ మిట్టల్ మాట్లాడుతూ, గత ఏడాది ఇదే రోజున తాము దేశవ్యాప్త బంద్‌ను జరిపామన్నారు. కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో గత ఏడాది జరిగిన బంద్ కంటే ఈసారి భారత్ బంద్ మరింత విజయవంతమవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.