బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో 11న తీర్పు

Vijay mallya
లిక్కడ్ డాన్, కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించనుంది. దేశంలో రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న విజయ్ మాల్యా కోర్టు ధిక్కార కేసులో ఈ నెల 11న సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేయనుంది. జస్టిస్‌ యు.యు.లలిత్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ శిక్ష వేయనుంది. జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
 
కాగా, ఈ కేసులో గత మార్చి పదో తేదీన వాదనులు ముగిసినప్పటికీ తీర్పును మాత్రం కోర్టు రిజర్వులో ఉంచింది. మాల్యా తరఫు న్యాయవాది, అమికస్‌ క్యూరీ జైదీప్‌ గుప్తా వాదనలన్నీ విన్న ధర్మాసనం ఇంకా చెప్పాల్సినది ఏమైనా ఉంటే మార్చి 15లోపు రాతపూర్వకంగా సమర్పించాలని అప్పట్లో సూచించింది. గత ఐదేళ్లుగా బ్రిటన్‌లో ఉంటున్న మాల్యా అందుబాటులో లేనందున గుప్తా తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తుది తీర్పును సోమవారం వెల్లడించనున్నారు.