ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (11:05 IST)

ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొన్న కారు... దెబ్బతిన్న పలు కోచ్‌లు!!

train
విశాఖపట్టణం - అమృతసర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును ఓ కారు ఢీకొట్టింది. మూసివున్న లెవల్ క్రాసింగ్ గేటు వద్ద దూసుకొచ్చిన కారు రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో రైలుకు చెందిన పలు కోచ్‌లు తెబ్బతిన్నాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పుర్‌లో శనివారం రాత్రి జరిగింది. అమిత వేగంగా దూసుకొచ్చిన కారు... హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పలు కోచ్‌లు దెబ్బతిన్నాయి. మూసివున్న రైల్వే క్రాసింగ్‌ను ఢీకొట్టి మరీ ముందుకు కారు దూసుకొచ్చిందని అధికారులు తెలిపారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 
 
మరోవైపు, శనివారం రాత్రి 7 గంటల సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బినా ప్రాంతంలో పింప్పి చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వీసీఎంసీ గూడ్సు రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటలను వెంటనే గుర్తించిన అధికారులు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారి అగర్వాల్ మీడియాకు తెలిపారు. రాత్రి 7 గంటల సమయంలో బినా వైపు వస్తున్న పీసీఎంసీ గూడ్సు రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని, వీటిని ఆర్పివేయడంతో ఈ ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.