సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (18:17 IST)

కరోనా వైరస్ సమయంలో కొత్త మహాత్ముడు వచ్చాడు.. సోనూపై వెటకారం

నటుడు సోనూసూద్‌పై శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ రాసి ఎడిటోరియల్‌లో సోనూ సూద్‌ను 'మహాత్ముడు' అంటూ వెటకారం చేశారు. 'కరోనా వైరస్ సమయంలో ఓ కొత్త మహాత్ముడు వచ్చాడని ఎద్దేవా చేసింది.

లక్షలాది మంది వలస కూలీలను సొంతూళ్లకు చేర్చాడు మహాత్మా సూద్ అంటూ గవర్నర్ కోషియారి కూడా ప్రశంసించారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీల విషయంలో ఏమీ చేయలేకపోయాయి. 
 
సోనూ సూద్ ఒక్కడే వాళ్లను సొంత రాష్ట్రాలకు పంపాడని చెప్పడానికా? అసలు సోనూ సూద్‌కి బస్సులు ఎక్కడి నుంచి లభించాయి? రాష్ట్రాలు వలస కూలీలను రావొద్దని చెబుతుంటే, వాళ్లంతా ఎక్కడికి వెళ్లినట్టు?' అని సామ్నా పత్రికలో విమర్శించారు.

కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలిసిన సోనూ సూద్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని, ఆయన 'ముంబై సెలబ్రిటీ మేనేజర్‌'గా మారిపోతారని మండిపడ్డారు. లాక్ డౌన్ సమయంలో మహారాష్ట్రలో చిక్కుకుపోయిన చాలామంది వలస కూలీలను సోనూసూద్ సొంత రాష్ట్రాలకు పంపిన సంగతి తెలిసిందే.