సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 20 సెప్టెంబరు 2018 (16:33 IST)

కోవై ఎస్ఎన్ఎస్ అకాడమీ ఎండీ రాసలీలలు.. ఆ యువతి వద్దంటున్నా?

మహిళలపై వేధింపులు అధికమవుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కోయంబత్తూరుకు చెందిన ఓ కళాశాల నిర్వాహకుడు.. అదే కాలేజీలో పనిచేసే యువతులప

మహిళలపై వేధింపులు అధికమవుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కోయంబత్తూరుకు చెందిన ఓ కళాశాల నిర్వాహకుడు.. అదే కాలేజీలో పనిచేసే యువతులపై రాసలీలలు చేసే ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

ఓ గదిలో కోవై కళాశాల నిర్వాహకుడు వేచి వుండగా, ఆపై ఆ గదికి వచ్చిన యువతిని కౌగిలించుకుని ముద్దెట్టుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కోవైలోని ఎస్ఎన్ఎస్ అకాడమీకి మేనేజింగ్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణియన్ (64)చే వేధింపులకు గురైన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కానీ బాధితురాలు పోలీసులు అధికారికంగా ఫిర్యాదు చేసిందా అనేది ఇంకా తెలియరాలేదు. బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఇప్పటికే సుబ్రహ్మణియన్‌ రాసలీలలకు సంబంధించిన రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోల్లో వున్న మహిళ ఒకరేనా? లేదా వేర్వేరు యువతులా అనేది తెలియాల్సి వుంది.