శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (14:20 IST)

పిల్లికోసం వుంచిన పాలలో విషం.. బాలుడు తాగేశాడు.. ఏమైందంటే?

Cat
పిల్లికోసం వుంచిన పాలను బాలుడు తాగాడు. ఇదే ఆ బాలుడి ప్రాణాపాయ స్థితికి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. ఇంటి పనులకు ఆటంకంగా మారిన ఓ పిల్లిని చంపేందుకు పాలలో విషం కలిపారు. కానీ ఆ పాలను పిల్లి తాగకముందే బాలుడు తాగాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్హవాలో వెలుగు చూసింది. సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మేధన గ్రామానికి చెందిన ఓ ఇంటిలో పిల్లి ఉంటోంది. 
 
అయితే ఆ పిల్లి చేస్తున్న పనులు ఇంటి సభ్యులకు ఇబ్బందిని కలిగించాయి. ఎలాగైనా పిల్లిని చంపాలనుకుని ఇంటి యజమానురాలు నిర్ణయించింది. దీంతో పాలలో విషం కలిపి గిన్నెలో పెట్టింది. కానీ ఆ పాలను పిల్లి తాగకముందే ఇంట్లో ఉంటున్న 12 ఏండ్ల బాలుడు తాగేశాడు. 
 
తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని సదర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువచ్చి ఉంటే బాధిత బాలుడి ప్రాణాలకు ముప్పు ఉండేదని వైద్యులు పేర్కొన్నారు.