బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జులై 2020 (14:46 IST)

ఇక సోనూసూద్ విలన్ కాదు.. రియల్ హీరో: సోమిరెడ్డి

సోనూసూద్ ఇక విలన్ కాదు.. రియల్ హీరో అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రశంసలు కురిపించారు.

మదనపల్లి రైతు కుటుంబానికి ట్రాక్టర్ పంపి అండగా నిలవడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా నిలిచిన సోను‌సూద్‌‌కు అభినందనలు తెలిపారు. 
 
‘‘సోను సూద్ నేనైతే ఇక మిమ్మల్ని విలన్‌గా చూడలేను. సినిమాల్లో మీరు హీరో పాత్ర వేయాల్సిందే. టాటా, మహీంద్ర, ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశాం. ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదు.

వలస కూలీలకు సాయం, మదనపల్లి రైతుకు ట్రాక్టర్, విద్యార్థులు స్వదేశం రావడంలో మీ చొరవ అభినందనీయం’’ అంటూ సోమిరెడ్డి కొనియాడారు.