అయోధ్య తీర్పు.. సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం
వివాదాస్పద అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పును వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల రాజమన్మభూమి హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదేసమయంలో మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలను ప్రత్యేకంగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.
నిజానికి అయోధ్య కేసు అటు మతపరంగానూ, ఇటు రాజకీయంగానూ ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. అయితే, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఓ కొలిక్కి వచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
తీర్పు రాగానే సున్నీ వక్ఫ్ బోర్డు ఆచితూచి వ్యవహరించాలని భావించినా, కొన్నిగంటల్లోనే కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు తీర్పును పూర్తిస్థాయిలో సమీక్షించిన వక్ఫ్ బోర్డు, అయోధ్య వివాదంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయరాదని నిర్ణయించుకుంది. సుప్రీం కోర్టు తీర్పును అంగీకరిస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది.