శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (09:57 IST)

సైబర్ నేరగాళ్ల పంజా.. సుప్రీం కోర్టు యూట్యూబ్ హ్యాక్!!

supreme court
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు చెందిన యూట్యూబ్ ఛానెల్ శుక్రవారం హ్యాక్ అయ్యింది. అమెరికా ఆధారిత కంపెనీ Ripple Labs అభివృద్ధి చేసిన క్రిప్టోకరెన్సీని ప్రచారం చేసే వీడియోలను చూపుతోంది. సుప్రీంకోర్టు అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో క్రిప్టో కరెన్సీని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలు కనిపించడంతో అది చూసిన వారంతా షాక్ అయ్యారు.
 
దీంతో భారత సర్వోన్నత న్యాయస్థానం యూట్యూబ్ ఛానెల్‌ను తొలగించడం జరిగింది. భారత సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్‌లోని సేవలు త్వరలో పునరుద్ధరించబడతాయని సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన నోటీసులో పేర్కొంది. 
 
రాజ్యాంగ బెంచ్‌ల ముందు జాబితా చేయబడిన కేసులు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్టు యూట్యూబ్‌ను ఉపయోగిస్తోంది. ఇకపోతే ఇటీవలే హైదరాబాద్‌ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అందులో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన యాడ్‌ను పోస్ట్ చేశారు.