మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (14:27 IST)

ఆదేశాలు బేఖాతర్ : చర్యలకు ఎన్నికల సంఘం ఆదేశాలు

త‌మ ఆదేశాల‌ను బేఖాత‌రు చేసి ఎన్నిక‌ల సంబ‌రాల‌ను జ‌రుపుకుంటున్న వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. దేశంలో కొవిడ్ సంక్షోభం కార‌ణంగా విజ‌యోత్స‌వ ర్యాలీలు, సంబ‌రాల‌పై ఈసీ నిషేధం విధించిన విషయం తెల్సిందే. 
 
అయినా కూడా ఈ ఆదేశాలను ఎవ‌రూ పాటించ‌డం లేదు. ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడుల‌లో ఆయా పార్టీల కార్య‌క‌ర్త‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ విష‌యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ఎన్నికల సంఘం... వెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది.
 
మరోవైపు, కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్ నేత డెరెక్‌ ఒబ్రెయిన్ గట్టి కౌంటరిచ్చారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ దూసుకుపోతున్న విషయం తెల్సిందే. దీంతో టీఎంసీ వరుసగా మూడోసారి అధికారంలోకి రానుంది. 
 
తాజా ఫలితాల నాటికి 200కు పైగా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కౌంటర్‌ ఇచ్చారు. 
 
బెంగాల్‌లో బీజేపీ 200 స్థానాలు గెలుస్తుందన్న ఆయన ప్రసంగం క్లిప్‌ను ఎమోజీలతో ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో విజయం కోసం ప్రధాని మోడీ, అమిత్‌ షా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని పరోక్షంగా విమర్శించారు.