శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

తమిళనాడులో కరోనా కల్లోలం.. కరోనా దెబ్బకు కాంగ్రెస్ అభ్యర్థి మృతి

తమిళనాడులో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ విశ్వరూపం చూపుతోంది. ఫలితంగా అనేక మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు. వీరిలో అనేక మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. అలా కరోనా వైరస్ బారినపడిన శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి మాధవరావు కూడా ఉన్నారు. ఈయన చనిపోయారు 
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఆయన కరోనా పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. వెంటనే ఆయనను మదురైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. మాధవరావుకు మద్దతుగా ఆయన తనయ ప్రచారం నిర్వహించింది. ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో శ్రీవిల్లిపుత్తూరులో 73.03 పోలింగ్‌ శాతం నమోదైంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. 
 
ఈ క్రమంలోనే ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పరిస్థితి విషమించి మాధవరావు కన్నుమూశారు. ఆయన మృతిపై ఏఐసీసీ కార్యదర్శి సంజయ్‌ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఈనెల 6న ఒకే దశలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ స్థానంలో మాధవరావు విజయం సాధించినపక్షంలో మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించాల్సివుంటుంది.