1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2023 (11:09 IST)

తమిళనాడులో భారీ వర్షాలు.. నీట మునిగిన ఆ నాలుగు జిల్లాలు

Tamil Nadu rains
Tamil Nadu rains
కుండపోత వర్షంతో తమిళనాడును భారీ వర్షాలు కుదిపేశాయి. ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షాల కారణంగా తూత్తుకుడి, తెన్‌కాశి, న్యాకుమారి, తిరునల్వేలి జిల్లాలు నీట మునిగాయి. 
 
ఈ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయడం జరిగింది. దీంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రైల్వే ట్రాకులపైకి నీళ్లు చేరడంతో పదుల కొద్దీ రైళ్లను రద్దు చేశారు. 
 
భారీ వర్షంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రభావిత నాలుగు రాష్ట్రాలకు మంత్రులను పంపింది. అధికారులు ఇప్పటికే సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. తిరునెల్వేలి జిల్లాలోని రిజర్వాయర్ల నుంచి 45 వేల క్యూసెక్కుల నీటిని తామిరభరణి నదిలోకి వదులుతున్నారు.