శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (17:54 IST)

పెళ్లికి అంగీకరించలేదని ఓ టీచర్‌ని తరగతి గదిలోనే..

పెళ్లికి ఒప్పుకోలేదని తరగతి గదిలోనే ఓ టీచరమ్మను హత్య చేసిన ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. గాయత్రి మెట్రిక్యులేషన్ పాఠశాలలో గణితం భోధించేందుకు వచ్చిన ఎస్ రమ్య అనే 23 ఏళ్ల యువతిపై రాజశేఖర్ అనే వ్యక్తి దాడి చేసాడు. బాధితురాలి ఇల్లు విద్యాసంస్థకు సమీపంలోనే ఉండటంతో ఆమె త్వరగానే పాఠశాలకు చేరుకుంది. 
 
ఇదే అదునుగా చూసిన నిందితుడు ఆమెను అతి కిరాతకంగా హత్య చేసాడని అధికారులు తెలిపారు. పెళ్లి ప్రస్తావనను తిరస్కరించినందుకే ఆమెపై దాడికి తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కాలేజీలో చదువుకునే సమయంలోనే నిందితుడికి ఆమె తెలుసని, ఆరు నెలల క్రితం బాధితురాలి తల్లిదండ్రుల వద్దకు రాజశేఖర్ వివాహ ప్రస్తావనను తీసుకురావడంతో వారు అందుకు సమ్మతించలేదు. పెళ్లికి నిరాకరించారనే కోపంతోనే నిందితుడు దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.