సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (08:49 IST)

సుభాష్ చంద్రబోస్ కు ఆలయం

స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ కు యూపీలో ఆలయం నిర్మితమైంది. గురువారం దానిని ప్రారంభించనున్నారు. సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897లో ఒడిశాలోని కటక్ లో జన్మించారు.

ఆయన ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే సుభాష్ చంద్ర బోస్ మృతి ఈ నాటికీ రహస్యంగానే మిగిలింది. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి.

ఈ సందర్భంగా యూపీలోని వారణాసి జిల్లాలోని ఆజాద్ హింద్ మార్గ్ వద్దనున్న సుభాష్ భవన్‌లో రెండు రోజుల పాటు సుభాష్ మహోత్సవ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ ఆలయాన్ని ప్రారంభించనున్నారు.

ఈ ఆలయంలో దళిత మహిళ పూజలు నిర్వహించనుంది. ఈ ఉత్సవాన్నివిశాల్ భారత్ సంస్థాన్ నిర్వహిస్తోంది. సంస్థ వ్యవస్థాపకులు, బీహెచ్‌యూకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్ శ్రీవాస్తవ్ పలు దశాబ్ధాలుగా సుభాష్ చంద్రబోస్ జీవితంపై పరిశోధనలు సాగిస్తున్నారు.

ఆయన తన సొంత ఇంటికి సుభాష్ భవన్ అని పేరు పెట్టుకున్నారు. సుభాష్ చంద్రబోస్ ఆలయాన్ని డాక్టర్ రాజీవ్ శ్రీవాస్తవ్ నిర్మించారు.