సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (21:54 IST)

చెల్లెలిపై అత్యాచారం.. జైలులోనే నిందితుడి చంపేసిన సోదరుడు.. సినీ ఫక్కీలో..?

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయ, దిశ లాంటి చట్టాలొచ్చినా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి చట్టాలను నమ్మి ప్రయోజనం లేదనుకున్న ఓ వ్యక్తి తన తన చెల్లెల్ని అత్యచారం చేసినవాడిని జైలులోనే హతమార్చాడు.

వివరాల్లోకి వెళితే.. చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయినా ఆ చెల్లి అన్నకు అతని మీద కోపం తగ్గలేదు. ఆ శిక్ష వాడికి సరిపోదని భావించి జైలులో అతన్ని చంపేశాడు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన జాకీర్ చెల్లెలిని అదే ప్రాంతానికి చెందిన మెహతాబ్ అనే వ్యక్తి రేప్ చేశాడు. దీంతో ఆమె ఆ అవమానాన్ని భరించలేకపోయింది. తీవ్ర మనోవేదనతో ఆమె ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడటంతో జాకీర్ కన్నీరు మున్నీరు అయ్యాడు. తన చెల్లెలిని దారుణంగా రేప్ చేసి, ఆమె మరణానికి కారణమైన మెహతాబ్‌పై పగ పెంచుకుని తీహార్ జైలులో అతడిని హతమార్చాడు. 
 
సినీ ఫక్కీలో తన వార్డులో ఉంటున్న తోటి ఖైదీలతో కావాలని గొడవ పెట్టుకుని దాడి చేశాడు. దీంతో జైలు వార్డెన్ అతని వార్డు మార్చి రేపిస్టు మెహతాబ్ వార్డులో వేశారు. ఏదో ఒకరోజు అతన్ని మట్టుబెట్టాలని ఓ లోహపు ముక్కతో కత్తిలా పదునుగా ఆయుధాన్ని తయారు చేసుకున్నాడు. అదును చూసి ఓరోజు మెహతాబ్‌ని దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.