గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (13:04 IST)

ప్రతి మగాడు రేపిస్టు కాదు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి మగాడు రేపిస్టు కాదన్నారు. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి మహిళ, చిన్నారుల సంరక్షణ కోసం కట్టుబడివుందని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క వివాహం హింసాత్మకం కాదని అన్నారు.
 
ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ ఓ ప్రశ్న లేవనెత్తారు. గృహహింస చట్టంలోని సెక్షన్ 3 కింద గృహహింస నిర్వచనానికి, అత్యాచారానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ 375ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా? అని ప్రశ్నించారు.
 
దీనికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బదులిచ్చారు. ఈ దేశంలోని ప్రతి వివాహాన్ని హింసాత్మకమని, ప్రతి పురుషుడ్ని రేపిస్టు (బలాత్కారుడు)గా పేర్కొనడం భావించడం కాదన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ ఈ దేశంలోని అందరికీ ప్రాముఖ్యమే అని చెప్పారు. 
 
ఇదిలావుంటే, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ కారణంగా సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ ఈ తరహా ప్రశ్నను సభలో సంధించారు.