మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (09:04 IST)

ఢిల్లీలో దారుణం: అప్పు తీసుకున్న వ్యక్తిపై దాడి... సిస్టర్స్ మృతి

gun shot
దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీసుకున్న వ్యక్తి దాడి నుంచి అన్నని కాపాడబోయిన ఇద్దరు యువతులు కాల్పులకు బలైపోయారు. ఢిల్లీలోని అంబేద్కర్ బస్తీకి చెందిన లలిత్ గతంలో ఓ వ్యక్తికి పదివేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వమని అతడిని శనివారం అడగగా వారి మధ్య వివాదం చెలరేగింది. 
 
ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి అప్పుతీసుకున్న వ్యక్తి మరికొందరితో వచ్చి లలిత్ ఇంటి తలుపు తట్టాడు. రాళ్లపై దాడి చేశాడు. లలిత్ సోదరుడు వెంటనే తోబుట్టువులకు, బంధువులకు సమాచారం అందించాడు.  లలిత్‌పై తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో లలిత్‌ను కాపాడేందుకు అతడి సోదరీమణులు పింకీ(30), జ్యోతి(29) ప్రయత్నించి తీవ్రగాయాలపాలయ్యారు. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులో తీసుకున్నారు.