గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 8 అక్టోబరు 2020 (22:06 IST)

కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు. ఇటీవల ఢిల్లీ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స కోసం ఆయన చేరారు. కొన్ని వారాలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన గుండెకి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ఐతే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్లు.
 
ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించి అత్యంత వ్యూహాత్మక నేతగా పేరుపొందారాయన. ఆయన మృతిని కొడుకు చిరాగ్ పాశ్వాన్ ధృవీకరించారు. ‘‘మిస్ యు పాపా.." అంటూ ట్వీట్ చేసారు. కాగా ఎన్డీఏ మంత్రివర్గంలో 30 రోజుల్లోపే రెండో మంత్రి కన్నుమూశారు. మరోవైపు బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాశ్వాన్ మరణం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.