సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (14:18 IST)

యూఎస్ ఎంబసీ ఉద్యోగుల నోట బాలీవుడ్ డైలాగులు.. ఫన్నీ ''వీడియో''ను చూడండి..

సోషల్ మీడియాలో డబ్ స్మాష్ పోస్టులు చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఈ కల్చర్ యూఎస్ రాయబార కార్యాలయం వరకు పాకింది. తాజాగా న్యూఢిల్లీలోని యూఎస్‌ రాయబార కార్యాలయం ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అ

సోషల్ మీడియాలో డబ్ స్మాష్ పోస్టులు చేయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఈ కల్చర్ యూఎస్ రాయబార కార్యాలయం వరకు పాకింది. తాజాగా న్యూఢిల్లీలోని యూఎస్‌ రాయబార కార్యాలయం ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. యూఎస్ ఎంబసీలోని అధికారులంతా బాలీవుడ్ సినిమా ఆడిషన్‌కు హాజరై.. హిందీ డైలాగులు చెప్తే ఎలా వుంటుందనే కాన్సెప్ట్‌తో ఈ వీడియోను రూపొందించారు. 
 
వీ లవ్ బాలీవుడ్ అంటూ ఫన్నీ ఆడిషన్ వీడియోను యూఎస్-ఇండియా దోస్తీ అనే హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేశారు. ఈ వీడియోను చూసినవారంతా అమెరికన్ల నోట బాలీవుడ్ డైలాగ్స్ విని పడీ పడీ నవ్వుకుంటున్నారు. 
 
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా షోలే లోని గబ్బర్‌ సింగ్‌ పాప్యులర్ డైలాగ్, ఓం శాంతి ఓంలోని ఏక్ చుట్కీ సింధూర్ డైలాగ్‌లను వల్లెవేసిన యూఎస్ ఎంబసీ ఉద్యోగులు నెటిజన్లను కడుపుబ్బా నవ్వించారు. ఈ వీడియోను మీరూ చూసి నవ్వుకోండి.