సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (08:59 IST)

యూపీలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

car accident
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు గాయపడ్డారు. కూలీలతో వారణాసి వెళుతున్న ట్రాక్టర్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన యూపీలోని మీర్జాపూర్ వద్ద సంభవించింది. కచ్వా సరిహద్దు జిల్ రోడ్డులో అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ట్రక్ అదుపుతప్పి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడి బనారస్ హిందూ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కూలీలు భదోహా జిల్లాలో పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘోరం జరిగిపోయింది.