శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (13:26 IST)

నది మధ్యలో చిక్కుకున్న కూలీలు... ఎలా బయటపడ్డారు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నలుగురు కూలీలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయపటపడ్డారు. రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా శ్యామాపూర్ ఏరియాలో ఓ నదిలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో పని ముగిసిన తర్వాత నలుగురు కూలీలు అక్కడే నిద్రించారు.
 
అయితే ఇంతలోనే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో నదిలో వరద నీరుపోటెత్తింది. నిద్రలోంచి లేచి చూసేసరికి నీరు చుట్టుముట్టింది. దీంతో బయటకు వెళ్లేందుకు దారి కనిపించలేదు. 
 
వెంటనే ఫోన్ ద్వారా విషయం తెలుపడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు చేయిస్తున్న నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చింది. వెంటనే కూలీలు చుక్కుకున్న ప్రాంతానికి చేరుకున్న అధికారులు క్రేన్ సాయంతో ఆ నలుగురు కూలీలను రక్షించారు.