గురువారం, 17 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (09:15 IST)

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

ayyappa locket
శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం శుభవార్త చెప్పింది. శబరిమల అయ్యప్ప బంగారు లాకెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. తొలి లాకెట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భక్తుడు అందుకున్నాడు. ఈ లాకెట్లను ఆన్‌లైన్ ద్వారా కూడా విక్రయించనున్నారు. 
 
మలయాళ పవిత్ర నూతన సంవత్సరాది విషు పర్వదినం సందర్భంగా కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసనన్ సోమవారం లాకెట్ల విక్రయాలను ప్రారంభించారు. శబరిమల గర్భగుడిలో ఉంచి పూజించిన బంగారు లాకెట్లను దేవస్థానం ఆన్‌లైన్ ద్వారా భక్తులకు విక్రయిస్తోంది. 
 
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన తొలి లాకెట్‌ను ఏపీకి చెందిన భక్కుడు ఒకరు అందుకున్నారు. అయ్యప్ప రెండు గ్రాముల లాకెట్ ధర రూ.19300, నాలుగు గ్రాముల లాకెట్ ధర రూ.38600, ఎనిమిది గ్రాముల లాకెట్ ధర రూ.77200లుగా నిర్ణయించారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రకటన విడుదల చేసింది.