శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:35 IST)

అన్ లాక్ 4 సడలింపుతో ఈ నెల 21 నుంచి తాజ్‌మహాల్ సందర్శనకు అనుమతి

కరోనా వైరస్ కారణంగా దేశంలోని పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ మూతబడిన విషయం తెలిసిందే. అయితే అన్ లాక్4 లో భాగంగా సెప్టెంబరు 1 నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే యూపీలోని తాజ్ మహాల్, ఆగ్రా పోర్ట్ మాత్రం ఇంకా సందర్శకుల కోసం ఓపెన్ కాలేదు.
 
ఈ క్రమంలో సెప్టెంబరు 21 నుంచి తాజ్ మహాల్, ఆగ్రా కోటను సందర్సకుల కోసం తిరిగి తెరవనున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆగ్రా సర్కిల్ సోమవారం ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ రెండు ప్రపంచ వారసత్వ కట్టడాలను మార్చి 17 నుంచి మూసివేశారు.
 
అయితే ఈ రెండు ప్రాంతాలలో వేర్వేరుగా 2,500 మంది సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. దీంతో పాటు సందర్శకులకు ఎలక్ట్రానిక్ టికెట్ జారీ చేయనున్నారు. పర్యాటకులంతా కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఈ మేరకు అధికారులు వెల్లడించారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అధికారులు తెలిపారు.