సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (20:57 IST)

పార్టీ జెండానే కాదు.. అన్నాడీఎంకే నాదే... నేను ఎవరికీ భయపడను : శశికళ

అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన అన్నాడీఎంకే బహిష్కృత మహిళా నేత శశికళ చెన్నైకు చేరుకున్నారు. నాలుగేళ్ళ తర్వాత తమిళ గడ్డపై అడుగుపెట్టిన ఆమెకు అభిమానులు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె చెన్నైకు చేరుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె తన రాజకీయ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ప్రజా జీవితంలో ఉంటానని, క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు. పైగా, తాను ఎవరికీ భయపడనని తేల్చి చెప్పారు. 
 
తనను వ్యతిరేకించిన వారికి తనేమిటో ఇప్పటికే అర్థమైవుంటుందన్నారు. అన్నాడీఎంకే పార్టీ నేతలు వణికిపోతున్నారన్నారు. అన్నాడీఎంకే పార్టీ తనదేనని ప్రకటించారు. అమ్మ వారసత్వాన్ని తాను కొనసాగిస్తానని చెప్పారు. మరోవైపు, శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉండటం గమనార్హం. 
 
శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉండకూడని తమిళనాడు మంత్రులు పదేపదే చెబుతున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా, ఇదే అంశంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమె లెక్కచేయలేదు. తన కారు ముందుభాగంలో ఆ పార్టీ జెండాను ఉంచారు.