శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (20:17 IST)

మధ్యప్రదేశ్‌లో దారుణం.. కరోనా రోగి(వృద్ధురాలి)పై అత్యాచారయత్నం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వృద్ధురాలిపై వార్డు బాయ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతుంటే.. ఈ వార్డు బాయ్ మాత్రం కామంతో రగిలిపోతూ... కరోనా వైరస్ సోకిన రోగిపై ఒక్కసారి కాదు రెండుసార్లు రేప్ అటెంప్ట్‌కు పాల్పడ్డాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 59 యేళ్ల మహిళ ఒకరు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ మహిళ నగరంలోని లోటస్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, ఆమెకు వెంటిలేటర్ సాయంతో చికిత్స చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతున్న వార్డులోనే పని చేస్తున్న వార్డుబోయ్ వివేక్ లోధి (25) అమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకుతూ, అత్యాచారయత్నం చేశాడు. 
 
తీవ్ర భయాందోళనకు గురైన ఆమె అలారం మోగించడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిన ఘటనపై ఆ తర్వాత ఆమె తన కుటుంబసభ్యులకు సమాచారం అందించింది.
 
బాధితురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో వివేక్ పై పోలీసులు సెక్షన్ 376, 354 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.