ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 మార్చి 2020 (19:13 IST)

రాధికా ఆప్టే‌కు ఏమైంది?

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే‌కు ఏమైంది?.. ఆమె ఆసుపత్రిలో ఎందుకు చేరింది?.. అసలేం జరిగింది?... ఇదీ ఇప్పుడు సినీజనంలో వినిపిస్తున్న చర్చ. ముఖానికి మాస్క్ ధ‌రించి హాస్పిటల్లో కూర్చున్న ఫొటోను రాధిక ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.

దాంతో రాధిక కూడా కరోనా వైరస్ బారిన పడిందని, ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటోందని వార్తలు వచ్చాయి. రాధిక ఫొటో చూసి `గల్లీబాయ్` ఫేమ్ విజయ్ వర్మ.. `ఓ గాడ్.. జాగ్రత్త డార్లింగ్.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు` అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది.

ఈ కామెంట్లు మరీ ఎక్కువైపోవడంతో తాజాగా రాధిక క్లారిటీ ఇచ్చింది. తాను కరోనా వైరస్ బారిన పడలేదని స్పష్టం చేసింది. `నేను హాస్పిటల్‌కు వెళ్లాను. అయితే కోవిడ్-19 పరీక్షల కోసం మాత్రం కాదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను.

అందరూ జాగ్రత్తగా ఉండండ`ని రాధిక పోస్ట్ చేసింది. అయితే తాను హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లిందో మాత్రం రాధిక క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రాధిక అబద్ధం చేబుతోందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.