మహారాష్ట్రలో వ్యాప్తిస్తున్న కరోనా.. ఒక్క రోజుల్లో రెట్టింపు కేసులు.. ఇద్దరు మృతి!
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా వ్యాపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక్క రోజులోనే కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య కూడా పెరిగుతోంది. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. ఒక్క మంగళవారమే ఏకంగా 155 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోల్చితే ఈ కేసులు రెట్టింపు అయ్యాయి. అంతేకాకుండా, ఇద్దరు కరోనా బాధితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో ప్రాణాలు పోవడం చాలా కాలం తర్వాత నమోదు కావడం గమనార్హం.
కాగా, మంగళవారం నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా 75 కేసులు నమోదు కాగా, ముంబై సర్కిల్‌లో 49 మందికి ఈ వైరస్ సోకింది. నాసిక్‌లో 13 కేసులు వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య 81.38 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 1,48,426కు పెరిగింది. సోమవారం మహరాష్ట్రలో 61 కేసులు నమోదు కావడం గమనార్హం.
మొత్తంమీద ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా రికవరీ రేటు 98.17 శాతంగా ఉంది. మరణాల రేటు మాత్రం 1.82 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా మంగళవారం 402 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, వీటితో కలుపుకుంటే ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 4.46 కోట్లకు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.