శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (21:57 IST)

ఇంట్లో చొరబడి 26 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్.. రూ.15లక్షల నగదు దోపిడి

కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్‌లోకి చొరబడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న రూ.15లక్షల నగదు దోచుకెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
మంగళవారం ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలిపారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు.
 
అత్యాచారం చేసిన అనంతరం ఫ్లాట్‌లో ఉన్న రూ.15లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు పేర్కొన్నారు. గార్డెన్‌ రీచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళ బుధవారం ఫిర్యాదు చేశారని, కోల్‌కతా పోలీస్‌ డిటెక్టివ్‌ డిపార్టుమెంట్‌ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. 
 
అత్యాచారానికి ముందు మహిళను కట్టేసి ఉంచినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఆ మహిళ ఫ్లాట్‌ నుంచి ఫోరెన్సిక్‌ బృందం శాంపిల్స్‌ను సేకరించిందని, అలాగే, ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.