శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (17:32 IST)

గుమాస్తాలా పనిచేస్తున్నా.. సీఎంలా కానేకాదు.. కన్నీళ్లతో కుమారస్వామి

కర్ణాటక సీఎం కుమార స్వామి కన్నీళ్లు పెట్టుకోవడం కొత్తేమీ కాదు. అయితే కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతల టార్చెర్‌తో ఆయన తట్టుకోలేక మళ్లీ ఏడుపు లగించుకోవడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌ల కూటమితో ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య ఎప్పుడూ వివాదాలు నెలకొంటూనే వున్నాయి. 
 
ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉన్నట్టుండి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతలు తనకు ఒత్తిడి తెస్తున్నారని.. వారి వేధింపులను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. ఈ తరహా ఇబ్బందులను ప్రజల కోసం పార్టీ కోసం భరిస్తున్నానని తెలిపారు. తాను ప్రస్తుతం గుమస్తాలా పనిచేస్తున్నానే కానీ సీఎంలా కాదని కుమార స్వామి తెలిపారు. 
 
ఇంతకుముందు.. కాంగ్రెస్‌తో చేతులు కలిపిన కొన్ని నెలలకే సీఎం పదవీ ముళ్లపడక అని కుమారస్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే తంతు కొనసాగితే కుమార స్వామి సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.