1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కేంద్ర మంత్రి నివాసంలో యువకుడి మృతదేహం... కుమారుడే నిందితుడా?

deadbody
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఉన్న కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ నివాసంలో ఓ యువకుడి మృతదేహాం లభ్యమైంది. ఇది స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఓ యువకుడిని కాల్చి చంపేశారు. ఈ దారుణానికి పాల్పడింది కూడా కేంద్ర మంత్రి కుమారుడన్న ప్రచారం సాగుతోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలోని మంత్రి నివాసంలో ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 
 
శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుడి పేరు వినయ్ శ్రీవాస్తవ అని పోలీసులు వెల్లడించారు. వినయ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భారీస్థాయిలో పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారని ఆ కథనాలు పేర్కొన్నాయి.