శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (15:45 IST)

వర్షాకాలం.. నోరూరించే మటన్ వేపుడు ఎలా చేయాలంటే?

మటన్‌లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఐరన్‌ ఉంటుంది. ఫ్యాట్‌ తక్కువ ప్రమాణాల్లో ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే పోషకవిలువలు మటన్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి పౌష్టికాహారం. అలాంటి మటన్‌తో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం..  
 
కావలసిన పదార్థాలు: 
మటన్‌: అరకిలో, 
వెల్లుల్లి రెబ్బలు: పది, 
పసుపు: టీస్పూను, 
గరంమసాలా: టేబుల్‌స్పూను, 
పెరుగు: కప్పు, 
పలావుఆకులు: రెండు, 
ఆవనూనె: కప్పు,
అల్లం పేస్ట్ : ఒక స్పూన్ 
ఉప్పు: రుచికి తగినట్లు
 
తయారుచేసే విధానం: 
ముందుగా మటన్‌ ముక్కలకు టేబుల్‌స్పూను నూనె, పసుపు, ఉప్పు, బాగా గిలకొట్టిన పెరుగు పట్టించి రెండు గంటలు నాననివ్వాలి. తర్వాత బాణలిలో నూనె పోయాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి, పలావు ఆకులు వేసి ఓ నిమిషం వేయించాలి. తరే్వ అన్నీ పట్టించిన మటన్‌ ముక్కలు వేసి సిమ్‌లో ఉంచి ఉడికించాలి. చివరగా గరంమసాలా వేసి బాగా కలిపి దించాలి. అంతే మటన్ 65 రెడీ. దీన్న అన్నంలోకి లేదా టమోటా సాస్‌తో సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.