ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : గురువారం, 6 డిశెంబరు 2018 (12:23 IST)

నోరూరించే నాటుకోడి పులుసు.. ఎలా చేయాలంటే..?

కావలసిన పదార్థాలు:
నాటుకోడిమాంసం - 1 కిలో
ఉల్లిపాయలు - 2
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత
కారం - 2 స్పూన్స్
ధనియాల పొడి - 1 స్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
ఎండుమిర్చి - 7
నూనె - సరిపడా
కొబ్బరి తురుము - 2 స్పూన్స్
గసగసాలు - అరస్పూన్
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి గడ్డ - 1
మిరియాలు - అరస్పూన్
 
తయారీ విధానం:
ముందుగా కొబ్బరి, గసగసాలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు ముక్కలు గ్రైండ్ చేసుకోవాలి. యాలకలు, దాల్చిన చెక్క, మిరియాలు, గసగసాలు వేయించి పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకుని ముందుగా తయారుచేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కారం, ధనియాల పొడి వేసి తగినన్ని నీరు పోసి ఉడికించుకోవాలి. చివరగా పొడిచేసి పెట్టుకున్న మసాలా వేసి 5 నిమిషాల పాటు ఉడికించి తీసుకుంటే.. వేడివేడి నాటుకోడి పులుసు రెడీ..