మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (19:25 IST)

అటుకుల లడ్డూలు తయారీ విధానం...

కావలసిన పదార్థాలు:
అటుకులు - 2 కప్పులు
ఎండు కొబ్బరి ముక్కలు - అరకప్పు
పుట్నాలు - అరకప్పు
మెత్తని పొడి బెల్లం - 1 కప్పు
పాలు - తగినంతా
 
తయారీ విధానం:
ముందుగా అటుకులు, ఎండు కొబ్బరి పుట్నాలను విడివిడిగా గ్రైండర్‌లో మెత్తగా పొడిచేసి పక్కనుంచాలి. ఈ పొడులన్నీ ఓ ప్లేటులో వేసి బెల్లం పొడితో కలపాలి. ఆ తరువాత కొద్దికొద్దిగా వేడిపాలను కలుపుతూ మిశ్రమాన్ని గుప్పెటినిండా తీసుకుని లడ్డూలా చేసుకోవాలి. అంతే... అటుకల లడ్డూలు రెడీ.