కోడి ముక్క లేకుండానే చికెన్ కర్రీ.. ఎలా?
కోడికూర వాసన వచ్చిందంటే చాలు.. నోటిలో లాలాజలం ఊరుతుంది. అదీ నాటుకోడి అయితే ఇక చెప్పనక్కర్లేదు. కానీ, ఇపుడు కోడి లేకుండానే చికెన్ కర్రీ ఆరగించవచ్చు. ఇదే అంశంపై అమెరికా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు విజయవంతమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే,
అమెరికాకు చెందిన ఐదుగురు శాస్త్రవేత్తలు కోడి రెక్కల కణాల నుంచి మాంసం ముక్కలను అభివృద్ధి చేశారు. ఆ ముక్కలను వండిన అనంతరం వాటి రుచి అచ్చం కోడికూర లాగే ఉందని వెల్లడించారు.
అంతేకాకుండా ఇదే తరహా ప్రయోగం చేపలు, ఇతర జంతువుల సజీవ కణాలపై కూడా చేశారు. వీటి మాంసాన్ని కూడా ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయవచ్చునని శాస్త్రవేత్తలు గ్రహించారు. దాంతో మాంసాహారం తినాలని కోరికతో ఉండి.. జీవహింస చేయకూడదని అనుకునేవారికి ఈ పద్ధతి సరైనదని వారు సూచిస్తున్నారు.