అమెరికాలో తెలుగు యువకుడు మృత్యువాత... నదిలో బోటు షికారుకెళ్లి...

NRI
శ్రీ| Last Updated: బుధవారం, 5 జూన్ 2019 (14:05 IST)
ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు అమెరికాలోని ఓ నదిలో మునిగి గల్లంతయ్యాడు. విశాఖకు
చెందిన ఎ.వెంకటరావు కుమారుడు అవినాష్‌. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐదేళ్ల కిందట అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్‌ పూర్తి చేసి మంచి
ఉద్యోగంలో స్థిరపడ్డాడు.

వారాంతపు సెలవులో రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ నదిలో బోటు షికారుకు వెళ్లి గల్లంతయ్యాడు అవినాష్. నది లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో అవినాష్‌ నదిలో మునిగిపోయాడని స్థానిక అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు అవినాష్ స్నేహితులు. దీంతో విశాఖ ప్లాంట్ టౌన్‌షిప్‌లో విషాదం నెలకొంది.దీనిపై మరింత చదవండి :