డల్లాస్ నగరాన్ని ఉర్రూతలూగించిన TANA ధిం-తాన

TANA Dhim TANA
ivr| Last Updated: మంగళవారం, 5 మే 2015 (14:35 IST)
డల్లాస్ నగరంలో తానా నిర్వహించిన “ ధింతాన”  వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డల్లాస్ తానా నాయకుడు శ్రీ రాజేష్ అడుసుమిల్లి చేసిన స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం దాదాపు 8 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ప్రతిభావంతులు సంగీతం, నృత్యం, Ms. TANA, Mrs. TANA వంటి వివిధ విభాగాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 
Folk Sub-Junior సంగీత  విభాగంలో సాయి తన్మయి ప్రధమ బహుమతి, Folk Junior విభాగంలో జూనియర్ విభాగంలో ప్రగ్య బ్రహ్మదేవర ప్రధమ బహుమతి, కృతి చంకుర & శ్రియ వసకర్ణ ద్వితీయ బహుమతి, వేద రామారావు తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. Folk/Film సీనియర్ విభాగంలో అఖిల్ ములుకుట్ల ప్రధమ బహుమతిని గెలుచుకున్నారు. అలాగే sub-junior classical విభాగంలో సాయి తన్మయి, junior classicalలో అభిరాం తాడేపల్లి ప్రధమ స్థానంలో, అశ్విన్ కుందేటి ద్వితీయ స్థానంలో, Senior విభాగంలో మైత్రేయి అబ్బూరి ప్రథమ స్థానంలో గెలుపొందారు.
TANA Dhim TANA

 
అలాగే సంస్కృతిక నృత్య విభాగంలో సంహిత బండారు&శ్రీరాగిని ఘంటసాల మొదటి స్థానంలో, సన్నిధి ఉదయగిరి & వ్రితిక ఇందూర్  ద్వితీయ స్థానాలను సొంతం చేసుకున్నారు. Senior నృత్య విభాగంలో సుమన్ వడ్లమాని, వైష్ణవి యలమరెడ్డి, శోభిత పోచిరాజు, సిల్పిత పోచిరాజు ప్రధమ స్థానంలో, యశస్వి పిండి & సంప్రీతి బింగి ద్వితీయ స్థానాలు గెలుపొందారు. అలాగే Junior విభాగంలో శ్రియ వస్కర్ల, ప్రితికశ్రీ తోటకూర, అవని, స్నిగ్ధ ఎలేస్వరపు, సోనిక పొద్దుటూరి, శ్రియ తెలకపల్లి విజేతలుగా నిలిచారు.దీనిపై మరింత చదవండి :