గాంధీ జయంతి సందర్భంగా డాలస్లో ప్లాజాలో ప్రత్యేక కార్యక్రమాలు : ప్రసాద్ తోటకూర

pnr| Last Updated: శుక్రవారం, 2 అక్టోబరు 2015 (10:36 IST)
మహాత్మా గాంధీ 146వ జయంతిని పురస్కరించుకొని అమెరికాలోని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డాలస్లోని పార్క్ ప్లాజా టవర్ వద్ద ఈ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు విందు భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) ఛైర్మన్ ప్రసాద్ తోటకూర తెలిపారు.

అలాగే, అదేవిధంగా టెక్సాస్లోని ఇర్వింగ్లో ఉన్న మహాత్మ గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద ఈ శనివారం సాయంత్రం 8 గంటలకు 'గాంధీ శాంతి పాదయాత్ర (నడక)'ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాదయాత్రకు ముందు శాంతికి చిహ్నమైన తెల్ల పావురాలను ఆకాశంలోకి ఎగుర వేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారిని తెల్ల దుస్తులు ధరించి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ రెండు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ ముని మనవరాలు సుకన్య భరత్ రామ్ హాజరవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రావు కల్వల, శ్రీనివాస్ గునుకుల, తైయాబ్ కుండవల, జాక్ గోదావని, అక్షయ్ వని, పీయూష్ పటేల్, షబ్నం మోగ్లీ, జీన్ హమెండ్ తదితరులు సహకరించనున్నారు.దీనిపై మరింత చదవండి :