డాలర్లు కావాలా? ప్రాణాలు కావాలా? ఇదేనా అమెరికాలో తెలుగువారి పరిస్థితి? 30 మంది...

ఒకప్పుడు అమెరికాలో మావాడు వున్నాడంటే ఎంతో గర్వంగా ఉండేది. అమెరికా సంబంధం అంటే పిల్లనిచ్చేవారు సైతం ఎంతో ఉత్సాహం చూపించేవారు. అంతేకాదు... అమెరికాలో పైచదువులు చదవాలని కలలు కనే యువత వుండేది. ఇప్పుడు ఆ పర

Crime in US
ivr| Last Updated: సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (19:11 IST)
ఒకప్పుడు అమెరికాలో మావాడు వున్నాడంటే ఎంతో గర్వంగా ఉండేది. అమెరికా సంబంధం అంటే పిల్లనిచ్చేవారు సైతం ఎంతో ఉత్సాహం చూపించేవారు. అంతేకాదు... అమెరికాలో పైచదువులు చదవాలని కలలు కనే యువత వుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపు కనుమరుగయ్యేట్లు కనిపిస్తోంది. అమెరికా అంటేనే బాబోయ్ అనే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకొచ్చిన గొడవ... బతుకుంటే బలుసాకు తినైనా బతకొచ్చు అనే పెద్దల సామెత గుర్తుకు వస్తోంది. దీనితో అమెరికా వెళ్లాలనే ధైర్యం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవ్వరూ చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ అమెరికా అంటే అంత భయం ఎందుకు వస్తున్నట్లు అని చూస్తే... ఇటీవలి కాలంలో అమెరికాలో వరుసగా తెలుగువారి హత్యల పరంపరే పట్టి చూపిస్తోంది.
 
సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇదే నెలలో బలైన రెండో యువకుడు. అంతకుముందు ఫిబ్రవరి 10న కాలిఫోర్నియాలో మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ వంశీ రెడ్డి మామిడాల అపార్టుమెంట్లో కాల్చి చంపబడ్డాడు. ఇతడు వరంగల్ జిల్లాకు చెందినవాడు. 
 
2008 నుంచి చూసినప్పుడు సుమారు 30 మందికి పైగా టెక్కీలు అమెరికాలో బలయ్యారు. కొంతమంది హత్య చేయబడితో మరికొందరు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. గత ఏడాది డిసెంబరులో విజయవాడకు చెందిన సాయితేజస్వి రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె రోడ్డు దాటుతుండగా ఓ వాహనం వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది.
 
జులై నెలలో 25 ఏళ్ల సంకీర్త్ తన రూమ్మేట్ చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. జూన్ నెలలో టాటా కన్సెల్టెన్సీలో పనిచేసే 25 ఏళ్ల నంబూరి శ్రీదత్త వాటర్ ఫాల్‌లో ఈతకు వెళ్లి మునిగి చనిపోయాడు. గత ఏడాది ప్రధమార్థంలో 23 ఏళ్ల శివకరన్ మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2015 జూన్ నెలలో 23 ఏళ్ల సాయికిరణ్ బందిపోటు దాడిలో మృత్యువాత పడ్డాడు. సాయికిరణ్ ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు.
 
ఇలా వరుసగా తెలుగు యువతీయువకులు అమెరికాలో బలవుతున్నారు. అమెరికాలో సుమారు 6 లక్షల మందికి పైగా నివాసముంటున్నట్లు ఒక అంచనా. వీరిలో అధికులు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డాక్టర్, బిజినెస్ మేనేజర్లుగా విజయవంతంగా పనిచేస్తున్నవారు వున్నారు. ఐతే ఇటీవల అమెరికాలో తెలుగువారి పట్ల జరుగుతున్న వరుస సంఘటనలు తెలుగువారి కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. డాలర్లు కావాలా...? ప్రాణాలు కావాలా..? అనేట్లు పరిస్థితి దాపురిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం కళ్లు తెరుస్తుందేమో చూడాలి.దీనిపై మరింత చదవండి :