సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By
Last Modified: బుధవారం, 11 సెప్టెంబరు 2019 (22:50 IST)

సెప్టెంబరు 20 నుంచి నాట్స్ క్రికెట్ కప్... 20 ఇంజనీరింగ్ కాలేజీల మధ్య క్రికెట్ పోటీ

సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట కూడా సేవా కార్యక్రమాలతో పాటు యువతను క్రీడల దిశగా ప్రోత్సాహించేందుకు తనవంతు సహకారం అందిస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి 27 వరకు నాట్స్ కప్ పేరుతో గుంటూరులో క్రికెట్ పోటీలు నిర్వహించనుంది. 
 
ప్రాగ్మ ఎడ్జ్ సంస్థతో కలిసి గుంటూరు దగ్గర వింజనపాడులో ఉన్న కేకేఆర్ అండ్ కేఎస్టీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తోంది. విద్యార్ధుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా ఈ నాట్స్ ఈ పోటీలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు. ఈ పోటీల్లో విజేతలకు 10 వేల రూపాయల నగదు బహుమతి, రన్నరప్‌కు రూ. 7వేలు అందజేస్తామన్నారు.