దీపావళి... దీపాల వెలుగుల్లో అమెరికా...

Diwali festival
ivr| Last Modified గురువారం, 12 నవంబరు 2015 (14:07 IST)
నార్త్ అమెరికా తెలుగు సంఘం(నాట్స్) బే ఏరియా ఆధ్వర్యంలో అమెరికాలోని ప్రవాసాంధ్రులు దీపావళి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. 11.11.2015 మంగళవారం సాయంత్రం ఫ్రిమోంట్‌లో ప్రవాసాంధ్రులు సాంప్రదాయ దుస్తుల్లో కలుసుకుని దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి దీపావళిని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల తెలుగు వంటకాలను వండారు. తదనంతరం కార్యక్రమంలో ఉత్తమ వంటకాలకు నాట్స్ బే ఏరియా తరపున బహుమతులు అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో బే ఏరియా నాట్స్ ప్రతినిధులు శ్రీనివాసరావు కొమ్మినేని, అశోక్ దాచర్ల, ఫణి ఉప్పల, వెంకట్ కొడాలి, శ్రీధర్ నెల్లూరు, రాంబాబు మందడపు, పుల్లారావు మందడపు, బాలాజీ దొప్పలపూడి, శ్రీనివాస్ చెరుకూరి, విజయ్ పొలిచర్ల, ప్రశాంత్ కర్రి, కిరణ్ నల్లమోతు, నరేష్ మానుకొండ, సుధాకర్ పొట్టి, రామచంద్రరావు నల్లమోతు, అనిల్ కుమార్ ఆలపాటి, శ్రీదేవి, నీరజ, వైష్ణవి, సాహిత్య, వినీత, లక్ష్మి, కవిత, హరిప్రియ, వైశాలి తదితరులు పాల్గొన్నారు.
Diwali festival
దీనిపై మరింత చదవండి :